Header Banner

అల్లూరి జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. ఏపీలో మొదలైన అలజడి!

  Tue Apr 29, 2025 18:09        Politics

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నక్సలైట్ల (Naxalites)ను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ మేరకు డెడ్ లైన్ పెట్టుకొని మరి నక్సలైట్లపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా ఛత్తీస్ గఢ్ ఆపరేషన్ కాగర్ (Operation Cogger) పేరుతో కర్రీగుట్టలను (Karrigutta) చుట్టుముట్టిన భద్రతా దళాలు (Security forces).. మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. ఎనిమిది రోజులుగా కర్రి గుట్టల్లో ఈ ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రతా బలగాలు పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 25 వేల మంది భద్రతా బలగాలను కేంద్రం మోహరించి ఈ గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే కూంబింగ్ లో భాగంగా ఈ రోజు ఉదయం.. అల్లూరి ఏజెన్సీలో పోలీసులకు మవోయిస్టులు కంట పడ్డారు.

 

ఇది కూడా చదవండి: సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

దీంతో అప్రమత్తమైన బలగాలు.. వారిపై కాల్పులు జరిపగా.. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాకుల మామిడి, కంటారం వంటి రెండు ప్రాంతాల్లో ఈ ఎదురుకాల్పులు జరిగ్గా.. మావోయిస్టు నేతలు బలగాల నుంచి తృటిలో తప్పించుకొని పారిపోయినట్లు సమాచారం అందుతుంది. దీంతో బలగాలు మావోయిస్టుల కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. కాగా మావోయిస్టు అగ్ర నేతలు ఉన్నారనే పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ కగార్ (Operation Cogger) చేపట్టిన బలగాలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. తీవ్ర ఎండతాపం కారణంగా బలగాలు ముందుకు కదలలేక పోతున్నట్లు తెలుస్తుంది. అలాగే అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ట్రాప్లను, ఐఈడీ బాంబులను ఏర్పాటు చేశారు. దీంతో వాటిని గుర్తించి నిర్వీర్యం చేసుకుంటూ బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటి వరకు 130కి పైగా ఐఈడీ బాంబులను బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశారు.


ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli